juvva movie: రాజమౌళి సలహాతో 'జింతాత' టైటిల్ ను మార్చేశారట!

  • 'జువ్వ' సినిమాకు తొలుత 'జింతాత' టైటిల్ అనుకున్నారు
  • రాజమౌళికి చెబితే వద్దని వారించారు
  • 'తారాజువ్వ' అనే టైటిల్ అయితే బాగుంటుందన్న దర్శక దిగ్గజం

దర్శక దిగ్గజం రాజమౌళి వద్ద గతంలో అసిస్టెంట్ గా పని చేసిన త్రికోటి దర్శకత్వంలో తెరకెక్కిన 'జువ్వ' సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో రంజిత్, పాలక్ లల్వాని హీరోహీరోయిన్లుగా నటించారు. తొలుత ఈ సినిమాకు 'జింతాత' అనే టైటిల్ ను ఎంచుకున్నారట. ఈ విషయాన్ని రాజమౌళికి చెబితే... వద్దని వారించారట. 'జింతాత' అనగానే రవితేజ గుర్తుకు వస్తాడని... ఈ సినిమాను రవితేజ సినిమాగా ప్రేక్షకులు భావించే అవకాశం ఉందని చెప్పారట. 'తారాజువ్వ' అనే టైటిల్ అయితే బాగుంటుందని సూచించారట. చివరకు ఈ సినిమాకు స్వరాలు సమకూర్చిన కీరవాణి సలహాతో... 'జువ్వ' అనే టైటిల్ ను ఖరారు చేశారట.

More Telugu News