Economic Report of the President (ERP): భారత్ కొంప ముంచింది ఆ రెండే...అమెరికా నివేదిక!

  • పెద్దనోట్ల రద్దు, జీఎస్‌టీతో వృద్ధి రేటు డౌన్
  • బ్యాంకింగ్ రంగంలో నిరర్థక రుణాల పెరుగుదల ఆందోళనకరం
  • పౌల్ట్రీ రంగంలో డబ్ల్యూటీఓ ఆదేశాన్ని బేఖాతరు చేయడంపై సీరియస్
పెద్ద నోట్ల రద్దు, వస్తు-సేవల పన్ను (జీఎస్‌టీ) భారతదేశ వృద్ధి రేటు మందగించడానికి ప్రధాన కారణాలని అమెరికా విడుదల చేసిన ఎకనామిక్ రిపోర్ట్ ఆఫ్ ది ప్రెసిడెంట్ (ఈఆర్‌పీ) తాజాగా వెల్లడించింది. నివేదిక ప్రకారం, భారతదేశ ఆర్థిక వ్యవస్థలో 86 శాతం నగదు చలామణిలో ఉంది. 90 శాతం లావాదేవీలు నగదు రూపంలోనే జరిగేవి. అయితే నవంబరు, 2016లో భారత ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడంతో వృద్ధి రేటు అంచనాలు తారుమారయ్యాయి.

 మరోవైపు జులై, 2017లో అమలు చేసిన జీఎస్‌టీ కూడా వృద్ధి రేటు పురోగమనానికి ప్రతిబంధకంగా మారింది. ఫలితంగా స్వల్పకాలిక అనిశ్చితి నెలకొంది. అలాగే భారతదేశ బ్యాంకింగ్ రంగంలో నానాటికీ నిరర్థక రుణాల (నాన్ పర్ఫార్మింగ్ లోన్స్-ఎన్‌పీఎల్‌లు) వాటా పెరిగిపోవడం కూడా ఆందోళన కలిగించే విషయం. భవిష్యత్తులో మరిన్ని సమస్యలకు ఈ ఒరవడి కారణమవుతుంది.

అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్)కి సమర్పించిన గణాంకాల ప్రకారం, గతేడాది మూడో త్రైమాసికంలో భారత్‌లోని అన్ని రుణాలకు సంబంధించి ఎన్‌పీఎల్‌ల వాటా 9.7 శాతంగా ఉంది. ఈ వాటా చైనాలో 1.7 శాతం మాత్రమే. మరోవైపు ఈ ఏడాదికి సంబంధించి రిజర్వు బ్యాంకు అంచనా వేసిన ఎన్‌పీఎల్‌ల వాటా మరింత ఆందోళన కలిగించే విధంగా ఉంది. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో వీటి వాటా 10.8 శాతానికి, సెప్టెంబరుతో ముగిసే మూడో త్రైమాసికానికి 11.1 శాతానికి చేరుకోనుందని తెలిపింది. మరోవైపు పౌల్ట్రీ రంగం విషయంలో డబ్ల్యూటీఓ ఆదేశాలను భారత్ పాటించకపోవడాన్ని అమెరికా ప్రభుత్వం తప్పుబట్టింది
Economic Report of the President (ERP)
India
US

More Telugu News