sai dharam tej: నేను మెగాస్టార్ కి మేనల్లుడినని ఆ దర్శకుడికి తెలియదు: సాయిధరమ్ తేజ్

  • క్రికెట్ ఆడుతుండగా వైవీఎస్ చౌదరి చూశారు 
  • సినిమాలో చేస్తావా? అని అడిగారు 
  • అలా వచ్చిందే 'రేయ్' సినిమా
కెరియర్ ఆరంభంలో మెగా ఫ్యామిలీ నేపథ్యం గురించి చెప్పుకోకపోవడానికి కారణమేమిటనే ప్రశ్న ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో సాయిధరమ్ తేజ్ కి ఎదురైంది. అప్పుడాయన  స్పందిస్తూ .. "నిజం చెప్పాలంటే నేను ఎవరినీ అవకాశాలు అడగవలసిన అవసరం లేదు ..చిరంజీవిగారి పేరు చెబితే చాలు .. కానీ ఆయన ఆశీస్సులు వుంటే చాలని మాత్రమే అనుకున్నాను".

"నేను మనోజ్ వాళ్లింట్లో క్రికెట్ ఆడుతుండగా వైవిఎస్ చౌదరి చూశారు. నేను ఎవరన్నది ఆయనకి తెలియదు .. నా సినిమాలో చేస్తావా ? అని అడిగారు. ఆ సందర్భంలోనే నేను చిరంజీవిగారి మేనల్లుడినని చెప్పాను. అలా వైవిఎస్ చౌదరితోనే 'రేయ్' సినిమా చేశాను. చిరంజీవిగారి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి గనుక .. ఆయన పేరు చెప్పుకుంటూ తిరగాల్సిన అవసరం లేదనేది నా భావన" అని చెప్పుకొచ్చాడు.        
sai dharam tej

More Telugu News