Tirumala: తిరుమలలో విషాదం... తలనీలాలిచ్చి, దర్శనానికి వెళ్లి రాగానే పాప మృతి... అక్కడే ఖననం!

  • పుట్టు వెంట్రుకలు తీయించేందుకు వచ్చిన సోను, గాయత్రి దంపతులు
  • విశ్రాంతి తీసుకుంటుండగా పాప మృతి
  • అక్కడే ఖననం చేయాలని కోరిన సోను ఫ్యామిలీ
  • అంగీకరించిన టీటీడీ అధికారులు

తిరుమల వెంకన్న సన్నిధిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తమ ఏడాది బిడ్డ సోనమ్ కు పుట్టు వెంట్రుకలు తీయించాలని బెంగళూరుకు చెందిన సోను, గాయత్రి దంపతులు రాగా, స్వామి దర్శనం ముగించుకుని బయటకు వచ్చిన గంటల్లోనే వారి బిడ్డ కళ్లముందే మరణించింది. వారి తల్లిదండ్రుల కోరిక మేరకు తిరుమలలోని శ్మశానంలోనే బిడ్డ మృతదేహం ఖననానికి టీటీడీ అధికారులు అనుమతి నిచ్చారు.

 మరిన్ని వివరాల్లోకి వెళితే, తలనీలాలు ఇచ్చిన తరువాత సర్వదర్శనం క్యూ లైన్లో స్వామి దర్శనానికి వెళ్లి వచ్చిన తరువాత, పీఏసీ - 4 ముందున్న షెడ్ లో సోను కుటుంబం విశ్రాంతి తీసుకునే నిమిత్తం కూర్చుంది. అప్పటి వరకూ చక్కగా ఆడుకున్న సోనమ్, కాసేపటికి కదలక మెదలక ఉండిపోగా, కంగారుతో తిరుమల అశ్విని ఆసుపత్రికి బిడ్డను తరలించగా, అప్పటికే పాప మృతి చెందినట్టు వైద్యులు స్పషం చేశారు. ఆపై పోలీసులు, అధికారులు వారి దగ్గరకు వచ్చి, మృతదేహాన్ని తమ ఖర్చుతో స్వగ్రామానికి తరలించే ఏర్పాటు చేస్తామని చెప్పగా, అక్కడే పూడ్చి పెట్టాలని వారు కోరారు. దీంతో తిరుమల ఆరోగ్య విభాగం అధికారులు, దగ్గరుండి ఖననం చేయించారు.

More Telugu News