Manasa Sarovar: కైలాస మానస సరోవరానికి వెళ్తారా? కనీసం రూ. 1.6 లక్షలతో ప్రయాణం... మార్చి 23లోపు దరఖాస్తులు!

  • మార్చి 23లోగా దరఖాస్తులు
  • జూన్ 8 నుంచి యాత్ర
  • రెండు మార్గాలను ఎంపిక చేసిన విదేశాంగ శాఖ

కైలాస శిఖరం... సాక్షాత్తు పరమశివుడు కొలువైవుండే ప్రదేశమని భారతీయులు నమ్మే ప్రాంతం. ఆ శిఖరం పాదాల చెంత ఉండేదే మానస సరోవరం. బ్రహ్మ దేవుని ఆలోచనల నుంచి ఆవిర్భవించి భూమి మీదకు చేరి పరమ పవిత్రమైన సరస్సే ఇదని హిందూ పురాణాలు ప్రస్తావించాయి. బ్రహ్మ మానసాన జన్మించినది కాబట్టి దీనికి మానస సరోవరమని పేరు. మానస సరోవరంలో స్నానం చేసినా, ఆ నీళ్లు తాగినా, మరణించిన తరువాత నేరుగా కైలాసానికి వెళ్లవచ్చని నమ్ముతారు. ప్రపంచంలోని అన్ని సరస్సుల్లో మానస సరోవరంలోని నీరే అత్యంత స్వచ్ఛమైనది. బ్రహ్మపుత్ర, కర్నలి, ఇండస్, సట్లెజ్ వంటి నదులకు పుట్టినిల్లు కూడా.

ఇక ఈ సంవత్సరం మానస సరోవరం యాత్ర చేయాలని భావించేవారు మార్చి 23లోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని భారత విదేశాంగ శాఖ సూచించింది. సిక్కింలోని నాథులా పాస్, ఉత్తరాఖండ్ లోని లిపులేఖ్ పాస్ మార్గాల గుండా యాత్ర సాగుతుందని పేర్కొంది. జూన్ 8 నుంచి యాత్ర ప్రారంభమవుతుందని తెలిపింది. ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని వెల్లడించింది. లిపులేఖ్ పాస్ మార్గం గుండా వెళ్లాలని భావించే వారికి రూ. 1.60 లక్షలు, నాథులా పాస్ మార్గంలో అయితే రూ. 2 లక్షల వరకూ ఖర్చవుతాయని వెల్లడించింది. దరఖాస్తులు 'https://kmy.gov.in' వెబ్ సైట్ లో అందుబాటులో ఉన్నాయని తెలిపింది.

More Telugu News