కేపీహెచ్బీ ‘మెట్రో’ స్టేషన్ దగ్గర రెచ్చిపోయిన సైకోలు.. చితగ్గొట్టిన ప్రజలు!

  • ఫుల్ గా మద్యం సేవించిన ఇద్దరు సైకోల వీరంగం
  • దుకాణదారులు, వాహనదారుల నుండి డబ్బుల డిమాండ్
  • డబ్బు ఇచ్చేందుకు నిరాకరించిన వారిపై దాడి
  • భయంతో పరుగులు తీసిన ప్రజలు
హైదరాబాద్ లోని కేపీహెచ్బీ మెట్రో రైల్వే స్టేషన్ దగ్గర సైకోలు రెచ్చిపోయారు. ఫుల్ గా మద్యం సేవించి ఉన్న ఇద్దరు సైకోలు.. దుకాణదారులు, వాహనదారుల నుండి డబ్బులు డిమాండ్ చేశారు. డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించిన వారిపై రాళ్లతో దాడి చేశారు. దీంతో, భయపడ్డ అక్కడి ప్రజలు పరుగులు తీశారు. అయితే, ధైర్యం చేసిన స్థానికులు ఇద్దరు సైకోలను పట్టుకుని వారిని చితగ్గొట్టి, కూకట్ పల్లి పోలీసులకు అప్పగించారు.
Go Back to Shorts
Hyderabad
metro rail
kphb

More Telugu News