Kamal Haasan: నేను మీలో నుంచి వచ్చిన వ్యక్తిని.. తలైవాను మాత్రం కాదు!: కమలహాసన్

  • ‘మక్కల్ నీది మయ్యమ్’గా పార్టీ పేరును ప్రకటించిన కమల్
  • ఒక్కరోజు ఆట కోసం రాజకీయాల్లోకి రాలేదు
  • నన్ను నేను నాయకుడిగా భావించుకోవట్లేదు : కమల్

ప్రముఖ నటుడు కమలహాసన్ తన రాజకీయపార్టీ పేరును ‘మక్కల్ నీది మయ్యమ్’ గా ప్రకటించిన విషయం తెలిసిందే. పార్టీ జెండా ఆవిష్కరణ అనంతరం కమల్ మాట్లాడుతూ, ‘నేను మీలో నుంచి వచ్చిన వ్యక్తిని. తలైవాను మాత్రం కాదు. ఒక్కరోజు ఆట కోసం రాజకీయాల్లోకి రాలేదు. సామాన్య జనంలో నుంచి పుట్టుకొచ్చిన వాడిని, నన్ను నేను నాయకుడిగా భావించుకోవట్లేదు. నేను ప్రజలకు సలహాలు చెప్పే నాయకుడిని కాదు. ప్రజల నుంచి సలహాలు తీసుకునే వ్యక్తిని.  నేను నాయకుడిని కాదు..ప్రజల చేతిలో ఉపకరణాన్ని. సేవ చేసేలా ప్రజలు నాకు మార్గదర్శనం చేయాలి. నాది మధ్యే మార్గం. అందుకే, పార్టీ పేరు ‘మయ్యం’ అని పెట్టాను. మంచి ఎటువైను నుంచి వచ్చినా తీసుకుంటా. ఎన్నికల సంఘంలో పార్టీ పేరు నమోదు చేశాను. ఇప్పటి వరకు నటించాను. నాకు ఇప్పుడు 63 ఏళ్లు. ఇక నా మిగిలిన జీవితం మీ కోసమే’ అని అన్నారు. ఈ సందర్భంగా పార్టీ జెండా ప్రత్యేకత గురించి ప్రస్తావిస్తూ, జెండాలోని ఆరు చేతులు, దక్షిణాది రాష్ట్రాలు ఆరింటిని ప్రతిబింబిస్తాయని చెప్పారు.

కమల్ కొత్త పార్టీ ‘మక్కల్ నీది మయ్యమ్’ అర్థమేంటంటే...

‘మక్కల్ నీది మయ్యమ్’ అంటే సెంటర్ ఫర్ పీపుల్స్ జస్టిస్ అని అర్థం. ఇక, ఈ పార్టీ జెండా గురించి చెప్పాలంటే..ఒక చేతి మణికట్టుని మరో చేయి పట్టుకుని ఉన్న ఆరు చేతులు, అందులో మూడు ఎరుపు రంగులో, మరో మూడు తెలుపు రంగులో ఉన్నాయి. వాటి మధ్యలో తెల్లని నక్షత్రం ఉంది.

More Telugu News