KCR: సోదరి మృతితో కన్నీంటి పర్యంతమైన కేసీఆర్!

  • సీఎం కేసీఆర్ రెండో అక్క విమలాబాయి మృతి
  • ఆమె భౌతికకాయానికి నివాళులర్పించిన కేసీఆర్ దంపతులు
  • అంత్యక్రియల ఏర్పాట్లు దగ్గరుండి పర్యవేక్షించిన హరీశ్ రావు
తెలంగాణ సీఎం కేసీఆర్ రెండో అక్క పి. విమలాబాయి (82) బుధవారం ఉదయం కన్నుమూశారు. సోదరి మ‌ృతితో ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. కేసీఆర్ దంపతులు, ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, ఎంపీ కవిత, పలువురు నేతలు ఆమెకు నివాళులర్పించారు. అంత్యక్రియల ఏర్పాట్లను హరీశ్ రావు దగ్గరుండి పర్యవేక్షించారు. కాగా, కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విమలాబాయి ఆల్వాల్ లోని నివాసంలో తుదిశ్వాస విడిచారు. 
KCR
Telangana
vimalabai

More Telugu News