akhil: అఖిల్ పై దృష్టి పెట్టిన 'తొలిప్రేమ' దర్శకుడు!

  • 'తొలిప్రేమ'తో హిట్ కొట్టిన వెంకీ అట్లూరి 
  • అఖిల్ తో సినిమా చేయాలనే ఆలోచన 
  • ఆ దిశగా మొదలైన ప్రయత్నాలు

ఈ మధ్యకాలంలో వచ్చిన ప్రేమకథా చిత్రాలలో 'తొలిప్రేమ' ప్రత్యేకతను చాటుకుంది. కొత్తదనంతో యూత్ ను ఒక రేంజ్ లో ఆకట్టుకుంది. కథా కథనాలను నడిపించడంలో దర్శకుడిగా వెంకీ అట్లూరి మంచి మార్కులు కొట్టేశాడు. దాంతో ఆయన దర్శకత్వంలో చేయడానికి యువ కథానాయకులు ఉత్సాహాన్ని చూపుతున్నారు. ఆయన మాత్రం తదుపరి సినిమాను అఖిల్ తో చేయాలనే ఉద్దేశంతో వున్నాడట.

'హలో' సినిమా కూడా ఆశించినస్థాయిలో వసూళ్లు రాబట్టకపోవడంతో, ఈ సారి కథల విషయంలో అఖిల్ మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. యువ దర్శకులు తెచ్చిన కథలను వింటున్నాడు. దాంతో ఆయనకి ఒక లైన్ వినిపించడానికి వెంకీ అట్లూరి రెడీ అవుతున్నాడట. రేపో మాపో అఖిల్ ను కలుసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అఖిల్ ఓకే అంటే చాలు .. చకచకా స్క్రిప్ట్ రెడీ చేసే ఆలోచనలో ఆయన వున్నాడని చెబుతున్నారు. వెంకీ అట్లూరి ప్రయత్నాలు ఎంతవరకూ ఫలిస్తాయో చూడాలి మరి.    

  • Loading...

More Telugu News