redmi note 5 flash sale: రెడ్ మీ నోట్5, నోట్5 ప్రో తొలి అమ్మకాలు రేపే

  • నోట్ 5 ధరలు రూ.9,999, రూ.11,999
  • నోట్ 5 ప్రో ధరలు రూ.13,999, రూ.16,999
  • ఫ్లిప్ కార్ట్, ఎంఐ డాట్ కామ్ లో మధ్యాహ్నం 12 గంటలకు విక్రయం

రెడ్ మీ నోట్ 5, నోట్ 5 ప్రో అమ్మకాలు మొదటి సారిగా రేపు జరగనున్నాయి. ఫ్లిప్ కార్ట్ డాట్ కామ్, ఎంఐ డాట్ కామ్ లో ఫ్లాష్ సేల్ కింద మధ్యాహ్నం సరిగ్గా 12 గంటలకు విక్రయం మొదలవుతుంది. ఈ నెల 14న ఈ మోడళ్లను షియోమి ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత విక్రయాలు ప్రారంభించడం ఇదే మొదటిసారి. రిలయన్స్ జియోతో టైఅప్ అయ్యి రూ.2,200 వరకు విలువైన వోచర్లను అందించనున్నట్టు ఈ సంస్థ ఇప్పటికే ప్రకటించింది. ఈ ఫోన్లతో పాటు అల్ట్రా స్లిమ్ కేసు కూడా ఉచితంగా అందుకోనున్నారు.

రెడ్ మీ నోట్ 5 3జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజీ మోడల్ ధర రూ.9,999. 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజీ వెర్షన్ ధర రూ.11,999. బ్లాక్, గోల్డ్, లేక్ బ్లూ, రోజ్ గోల్డ్ రంగుల్లో లభ్యం. ఇక రెడ్ మీ నోట్ 5 ప్రో మోడల్ 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజీ ధర రూ.13,999. 6జీబీ ర్యామ్ రకం ధర రూ.16,999. ఇది కూడా బ్లాక్, గోల్డ్, లేక్ బ్లూ, రోజ్ గోల్డ్ రంగుల్లో లభిస్తుంది.

More Telugu News