dhaka stock exchange: భారత స్టాక్ ఎక్సేంజ్ లను అడుగు పెట్టనీయని బంగ్లాదేశ్... ఢాకా స్టాక్ ఎక్సేంజ్ లో వాటా చైనా కంపెనీల పరం

  • 25 శాతం వాటా కోసం ఎన్ఎస్ఈ బిడ్
  • అధిక ధర ఆఫర్ చేసిన చైనా కంపెనీల వైపే మొగ్గు
  • చైనా కన్సార్టియం బిడ్ ఆమోదీనయంగా ఉందని ప్రకటన

పొరుగు దేశం బంగ్లాదేశ్ భారత స్టాక్ ఎక్సేంజ్ ల ప్రవేశానికి నో చెప్పింది. ఢాకా స్టాక్ ఎక్సేంజ్ (డీఎస్ఈ)లో వాటా కోసం మనదేశానికి చెందిన నేషనల్ స్టాక్ ఎక్సేంజ్, అమెరికాకు చెందిన నాస్ డాక్ స్టాక్ ఎక్సేంజ్ తోపాటు బంగ్లాదేశ్ కే చెందిన ఫ్రాంటియర్ బంగ్లాదేశ్ తో కూడిన కన్సార్టియం బిడ్ దాఖలు చేయగా... దీన్ని కాదని చైనాకు చెందిన కన్సార్టియంకు 25 శాతం వాటా ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఎన్ఎస్ఈతో కూడిన కన్సార్టియం ఢాకా స్టాక్ ఎక్సేంజ్ లో వాటా కోసం షేరు ఒక్కింటికి 15 టాకాలను ఆఫర్ చేయగా, చైనా కన్సార్టియం 22 టాకాలను ఆఫర్ చేసింది. దీంతో డీఎస్ఈ డైరెక్టర్లు చైనా కన్సార్టియం ప్రతిపాదనను అంగీకరించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆర్థిక, టెక్నాలజీ అంశాల పరంగా తమకు చైనా సంస్థల బిడ్ ఆమోదీనీయంగా ఉందని పేర్కొన్నారు. నిన్న జరిగిన బోర్డు సమావేశంలో చైనాకు చెందిన షెంజెన్ స్టాక్ ఎక్సేంజ్, షాంఘై స్టాక్ ఎక్సేంజ్ ల ప్రతిపాదనకు తుది ఆమోదం తెలుపుతూ నిర్ణయం తీసుకున్నట్టు డీఎస్ఈ ఎండీ కేఏఎం మజేదుర్ రెహ్మాన్ విలేకరులకు తెలిపారు.

More Telugu News