APCC: రేపు చిత్తూరులో 'ఆంధ్రుల ఆత్మ గౌరవ దీక్ష': ఏపీసీసీ

  • రేపు మధ్యాహ్నం 3 గంటలకు దీక్ష
  • దీక్షలో పాల్గొననున్న రఘువీరారెడ్డి, కేంద్ర, రాష్ట్ర మాజీ మంత్రులు
  • విజయవంతం చేయాలని పిలుపు

ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని, హక్కుల సాధన కోసం ఏపీసీసీ ఇచ్చిన పిలుపు మేరకు రేపు మధ్యాహ్నం 3 గంటలకు చిత్తూరు ఆర్డీఓ కార్యాలయం వద్ద జరిగే ఆంధ్రుల ఆత్మ గౌరవ దీక్షలో ఏపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ ఎన్.రఘువీరారెడ్డి పాల్గొననున్నారు.

ఈ సందర్భంగా రఘువీరారెడ్డి మాట్లాడుతూ..  రాజకీయాలకు, పార్టీలకు, వర్గాలకు అతీతంగా అందరం కలిసి మన హక్కులను సాధించుకుందామని, ఆత్మ గౌరవాన్ని కాపాడుకుందామని అన్నారు. ఈ దీక్షలో ఏపీసీసీ సీనియర్ నాయకులు, కేంద్ర, రాష్ట్ర మాజీ మంత్రులు పాల్గొంటారని అన్నారు. అలాగే కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలు ఈ దీక్షని విజయవంతం చేయాలని రఘువీరారెడ్డి పిలుపునిచ్చారు.

More Telugu News