charan: చరణ్ .. బోయపాటి మూవీ హిందీ శాటిలైట్ రైట్స్ .. 22 కోట్లు!

  • ఫస్టు షెడ్యూల్ పూర్తి చేసిన బోయపాటి 
  • రెండవ షెడ్యూల్ కి సన్నాహాలు 
  • ఆశ్చర్య పరుస్తోన్న హిందీ శాటిలైట్ బిజినెస్

చరణ్ కథానాయకుడిగా బోయపాటి శ్రీను ఒక సినిమాను మొదలుపెట్టేశాడు. ఆల్రెడీ ఫస్టు షెడ్యూల్ ను కూడా పూర్తి చేసేశాడు. రెండవ షెడ్యూల్ కి ఈ సినిమా యూనిట్ రెడీ అవుతోంది. షూటింగ్ పరంగా ఈ సినిమా తొలిదశలో ఉండగానే , హిందీ శాటిలైట్ రైట్స్ భారీ రేటుకు అమ్ముడైనట్టుగా తెలుస్తోంది. హిందీ శాటిలైట్ రైట్స్ ను 22 కోట్లకు అమ్మేశారట. ఒక తెలుగు సినిమా హిందీ శాటిలైట్ రైట్స్ ఈ స్థాయి ధరకి పోవడం ఇదే ఫస్టు టైమ్ అని అంటున్నారు.

 హిందీ ప్రేక్షకులకు చరణ్ తెలుసు .. ఆల్రెడీ ఆయన అక్కడ ఒక సినిమా చేశాడు. ఇక కథానాయిక కైరా అద్వానీకి అక్కడ మంచి ఫాలోయింగ్ వుంది. ఈ సినిమాలో విలన్ గా చేస్తోన్న వివేక్ ఒబెరాయ్ అక్కడివాడే. ఈ కారణంగానే ఈ సినిమా హిందీ శాటిలైట్ రైట్స్ మంచిరేటుకు పోయాయని చెబుతున్నారు. తమిళ సీనియర్ హీరో ప్రశాంత్ .. స్నేహా .. నవీన్ చంద్ర ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు.    

More Telugu News