Chiranjeevi: చిరంజీవి 'సైరా' సినిమాలో అమితాబ్‌ బచ్చన్.. ఫొటో పోస్ట్ చేసి స్పష్టత ఇచ్చిన దర్శకుడు

  • సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో ‘సైరా: నరసింహారెడ్డి’
  • అమితాబ్‌తో ఫొటో దిగిన దర్శకుడు
  • అమితాబ్ 'సైరా' నుంచి తప్పుకున్నారని ఇటీవల పుకార్లు
  • ఫొటోతో సమాధానం ఇచ్చిన సురేందర్‌ రెడ్డి
సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో చిరంజీవి నటిస్తోన్న ‘సైరా: నరసింహారెడ్డి’ సినిమా రెండో షెడ్యూల్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ సినిమాలో నయనతార, విజయ్‌ సేతుపతి, సుదీప్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న విషయం తెలిసిందే. కాగా, ఈ సినిమాలో బిగ్ బీ అమితాబ్  బచ్చన్ కనపడతారా? కనపడరా? అనే విషయంపై తాజాగా స్పష్టత వచ్చింది. దర్శకుడు సురేందర్‌రెడ్డి తాజాగా అమితాబ్‌తో ఫొటో దిగి అభిమానులతో పంచుకున్నారు.

దీంతో ‘సైరా’లో అమితాబ్‌ నటిస్తోన్న విషయంపై క్లారిటీ వచ్చేసింది. అమితాబ్ బచ్చన్ సైరాలో నటిస్తున్నారని మొదట అనుకున్నారు. కానీ, ఇటీవల సైరా సినిమా నుంచి అమితాబ్ తప్పుకున్నారని పుకార్లు వచ్చాయి. దీంతో సురేందర్ రెడ్డి ఒక్క ఫొటోతో పుకార్లకు సమాధానం ఇచ్చారు. 
Chiranjeevi
saira
surender reddy
Amitabh Bachchan

More Telugu News