getup srinu: 'జబర్దస్త్'లో ఎవరికి ఎవరూ పోటీ కాదు: గెటప్ శీను

  • కామెడీని పండించడంలో ఎవరి స్టైల్ వాళ్లది 
  • ఒకరిని ఒకరం అనుకరించాలనుకోము
  • ఏ టీమ్ ప్రత్యేకత ఆ టీమ్ కి వుంది 
  • అక్కడే 'జబర్దస్త్' సక్సెస్ అయింది
తాజాగా ఐ డ్రీమ్స్ తో గెటప్ శీను మాట్లాడుతూ .. తన కెరియర్ కి సంబంధించిన అనేక విషయాలను గురించి పంచుకున్నారు. హైపర్ ఆది వచ్చిన తరువాత తమ స్కిట్స్ కి వచ్చే వ్యూస్ తగ్గాయనే విషయాన్ని ఆయన ఖండిస్తూ .. " హైపర్ ఆదికి వచ్చే వ్యూస్ పెరిగాయి గానీ .. మా స్కిట్స్ కి వచ్చే వ్యూస్ తగ్గలేదు. పంచ్ లు వేయడంలో హైపర్ ఆది నెంబర్ వన్ .. ఆయన స్టైల్ ఆయనది .. మా స్టైల్ మాది" అన్నాడు.

'జబర్దస్త్ 'లో ఎవరూ ఇంకొకరిలా చేయాలనుకోరు .. ఒక్కో టీమ్ ఒక్కో కాన్సెప్ట్ తో ముందుకు వెళుతూ ఉంటుంది. మా స్కిట్ లో కామెడీ ఒకలా వుంటుంది .. ఆది స్కిట్ లో పంచ్ లు ఒక రేంజ్ లో ఉంటాయి .. చంద్ర స్కిట్ లు ఫ్యామిలీ నేపథ్యంలో సరదాగా ఉంటాయి. రాకెట్ రాఘవ చిన్న పాయింట్ పట్టుకుని భలేగా చేస్తాడు .. రాజేశ్ చిన్న పిల్లలలతో మెప్పిస్తాడు. ఇలా ఎవరి టీమ్ ప్రత్యేకత వాళ్లకి ఉండటం వల్లనే ఈ కార్యక్రమం సక్సెస్ అయింది .. ఇక్కడ ఎవరూ ఎవరికీ పోటీ అనుకోము" అంటూ చెప్పుకొచ్చాడు.    
getup srinu

More Telugu News