Andhra Pradesh: తిరుపతిలో మంత్రి కామినేనికి చేదు అనుభవం .. అడ్డుకున్న టీడీపీ కార్యకర్తలు!

  • స్విమ్స్ లో ఓ అధికారిక కార్యక్రమంలో పాల్గొన్న కామినేని
  • స్థానిక ఎమ్మెల్యే సుగుణమ్మకు అందని ఆహ్వానం
  • మండిపడ్డ ఎమ్మెల్యే 
తిరుపతిలో మంత్రి కామినేని శ్రీనివాసరావు పర్యటన సందర్భంగా ప్రొటోకాల్ వివాదం తలెత్తింది. స్విమ్స్ లో నిర్వహించిన ఓ అధికారిక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అయితే, ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే సుగుణమ్మను ఆహ్వానించలేదు. దీంతో, ప్రొటోకాల్ వివాదం తలెత్తింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుగుణమ్మ మాట్లాడుతూ, ఈ కార్యక్రమానికి తనను ఆహ్వానించలేదని, గతంలో కూడా తనను ఆహ్వానించని సంఘటనలు ఉన్నాయని అన్నారు.

 ఈ విషయమై కామినేనిని నిలదీసేందుకే తాను ఇక్కడికి వచ్చానని చెప్పిన సుగుణమ్మ, ఇక్కడ ఏర్పాటు చేసిన బ్యానర్లు, ఫొటోల్లో చంద్రబాబు నాయుడు ఫొటో లేదని అన్నారు. స్విమ్స్ గవర్నింగ్ కౌన్సిల్ కు చంద్రబాబు నాయుడు చైర్మన్ గా ఉన్నారని, ఆయన ఫొటోను ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు.
Andhra Pradesh
Tirupati
Kamineni Srinivas

More Telugu News