Illeana: 'ఆట' సినిమా చేయకూడదనుకున్నా : ఇలియానా

  • తొలి చిత్రం దేవదాస్‌లో అంగాంగ ప్రదర్శనపైనే గురి
  • ఆడవాళ్లను వస్తువులుగా చూడటం ఇబ్బందికరం
  • జల్సా, కిక్‌ సినిమాల్లో పాత్రలు భిన్నమైనవి
'దేవదాసు' చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన గోవా అందం ఇలియానా దక్షిణాదిలో ప్రధానంగా తెలుగు సినిమాల్లో తనను 'అందాల వస్తువు'గానే చూపించారని తెగ ఆవేదన చెందింది. ఇటీవల ఓ జాతీయ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో ఆమె పలు విషయాలను తెలిపింది. తన సినిమాల్లో మహిళలను వస్తువులుగానే పరిగణించడం చాలా చిరాకు తెప్పించిందని వాపోయింది.

తన తొలి చిత్రం దేవదాసులో తన అంగాంగ ప్రదర్శనకే ప్రాధాన్యతను ఇచ్చారని తెలిపింది. పోకిరి, కేడీ, ఖతర్నాక్, మున్నా చిత్రాల తర్వాత 'ఆట' సినిమా చేసేటప్పుడు కూడా తనను అందాల వస్తువుగానే చూపించడం చాలా ఇబ్బందికరంగానూ, బాధగానూ అనిపించినట్లు చెప్పింది. 'అయ్యిందేదో అయ్యింది. ఇక చాలు' ఈ సినిమా ఆపేద్దాం అని భావించానని చెప్పింది. అయితే పవన్‌తో చేసిన జల్సా, రవితేజతో నటించిన కిక్ చిత్రాల్లో తన పాత్రలు భిన్నంగా వున్నాయంటూ ఆ రెండు చిత్రాలకు మాత్రం ఈ అందాల భామ మంచి మార్కులేసింది.
Illeana
Kick
Aata
Devadau
Cinema

More Telugu News