varun tej: అమెరికాలో కొనసాగుతోన్న 'తొలిప్రేమ' హవా!

  • తెలుగు రాష్ట్రాల్లో 'తొలిప్రేమ' సందడి 
  • అమెరికాలోను తగ్గని జోరు 
  • దర్శకుడిగా వెంకీ అట్లూరికి మంచి మార్కులు

వరుణ్ తేజ్ .. రాశి ఖన్నా జంటగా నటించిన 'తొలిప్రేమ' ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా, తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ కూడా భారీ వసూళ్లను కొల్లగొడుతూ దూసుకుపోతోంది. రెండవ వారంలోను ఈ సినిమా యూఎస్ లో అదే దూకుడును కొనసాగిస్తూ ఉండటం విశేషం.

ఇప్పటివరకూ సాధించిన వసూళ్లతో ఈ సినిమా 1 మిలియన్ మార్క్ కి చేరువలో ఉందని తరుణ్ ఆదర్శ్ చెప్పారు. వసూళ్ల పరంగా ఈ సినిమా 1 మిలియన్ మార్క్ ను క్రాస్ చేయడానికి మరెంతో సమయం పట్టదని అంటున్నారు. వెంకీ అట్లూరి తయారు చేసుకున్న బలమైన కథా కథనాలు ..  హీరో హీరోయిన్ల పాత్రలను మలిచిన తీరు .. వాళ్లను డిఫరెంట్ లుక్స్ తో చూపించిన తీరు అక్కడి ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుందని చెబుతున్నారు. ఈ సినిమా సక్సెస్ తో దర్శకుడు వెంకీకి చిరంజీవి ప్రశంసలు సైతం దక్కడం విశేషం.      

  • Loading...

More Telugu News