veeramachineni ramakrishna: 'వీరమాచనేని డైట్'కు భారీగా మద్దతు పలుకుతున్న జనాలు!

  • వీరమాచనేని డైట్ ప్లాన్ సూపర్ అంటున్న జనాలు
  • 5 కేజీల బరువు తగ్గానన్న ఓ మహిళ
  • డాక్టర్ల మాటలను నమ్మవద్దని చెప్పిన మరో మహిళ
వెయిట్ లాస్, మధుమేహంకు సంబంధించిన డైట్ ప్లానింగ్ తో విజయవాడకు చెందిన వీరమాచనేని రామకృష్ణ ఒక్కసారిగా హెడ్ లైన్స్ లో నిలిచిన సంగతి తెలిసిందే. ఆయన సలహాలను కొంత మంది వైద్యులు వ్యతిరేకిస్తుండగా... మరికొందరు డాక్టర్లు మద్దతు పలుకుతున్నారు. మరోవైపు, ప్రజల్లో ఈ డైట్ ప్లానింగ్ పై ఆసక్తి అంతకంతకూ పెరుగుతోంది. పెద్ద ఎత్తున వీరమాచనేని డైట్ ప్లానింగ్ కు మద్దతు లభిస్తోంది.

ఓ మహిళ మాట్లాడుతూ, తాను రామకృష్ణ సలహాలను పాటించి 5 కిలోల బరువు తగ్గానని తెలిపారు. మరో మహిళ మాట్లాడుతూ, ట్యాబ్లెట్స్ కోసం తాను ప్రతి నెలా రూ. 5,000 ఖర్చు చేసేదాన్నని... ఈ డైట్ ప్లాన్ ను ప్రారంభించినప్పటి నుంచి మెడిసిన్స్ ను వాడటం మానేశానని చెప్పారు. రామకృష్ణ డైట్ ప్లాన్ ను వ్యతిరేకిస్తూ మాట్లాడే డాక్టర్ల సూచనలను నమ్మవద్దని ఆమె కోరారు.
veeramachineni ramakrishna
diet plan

More Telugu News