పాత స్నేహితుడు, కొత్త మిత్రుడి మధ్య నలిగిపోయిన అనీషా... అపోహతోనే ఆత్మహత్య!
- అనంతపురంలో అనీషాకు స్నేహితుడు.. 21న అతని పెళ్లి
- పెళ్లికి వెళితే దీక్షిత్ ఏమనుకుంటాడోనని అపోహ
- బాయ్ ఫ్రెండ్ కు 350 మెసేజ్ లు పెట్టిన అనీషా
- దీక్షిత్ తప్పు లేదంటున్న పోలీసు వర్గాలు
అనంతపూర్ లో అనీషాకు ఓ స్నేహితుడు ఉండేవాడని, అతని గురించి దీక్షిత్ కు స్వయంగా చెప్పిన తరువాత, ఆమెలో కొత్త అపోహలు మొదలయ్యాయని భావిస్తున్నామని, అదే ఆత్మహత్యకు పురికొల్పి ఉండవచ్చని పోలీసు వర్గాలు అంటున్నాయి. ఈ నెల 21న అనంతపురంలో అతని వివాహం ఉండగా, దానికి వెళ్లి వస్తానని అనీషా, దీక్షిత్ నుంచి అనుమతి కూడా తీసుకుందని, అయినప్పటికీ, అతను ఏమైనా అనుకుంటాడేమోనని తీవ్ర ఆందోళనలో పడిపోయిందని తెలిపారు.
స్నేహితురాలు ఇంటికి వెళ్లడంతో ఒంటరిగా గదిలో ఉండిపోయిన అనీషా, 16వ తేదీ రాత్రి 8 గంటల నుంచి ఒంటిగంట వరకూ దాదాపు 350 మెసేజ్ లు చేసిందని, వీటన్నింటితో పాటు వీడియో కాల్ సంభాషణనూ విశ్లేషిస్తున్నామని పోలీసులు తెలిపారు. దీక్షిత్ నుంచి అనీషాపై ఎటువంటి ఒత్తిడి లేదని ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్టు తెలిపారు.