Big Boss: బిగ్ బాస్-2 హోస్ట్ రేసులో అల్లు అర్జున్ కూడా!

  • తొలి సీజన్ హోస్ట్ ఎన్టీఆర్
  • ఆయన తప్పుకున్నాడని వార్తలు
  • ఇటీవలే వినిపించిన హీరో నాని పేరు
  • ఇప్పుడు తెరపైకి అల్లు అర్జున్ కూడా

తెలుగు లోగిళ్లలో ఎంతో విజయవంతమైన 'బిగ్ బాస్' రియాల్టీ షో తొలి సీజన్ హోస్ట్ గా వ్యవహరించిన ఎన్టీఆర్, రాజమౌళి చిత్రం కోసం రెండో సీజన్ నుంచి తప్పుకున్నాడన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో, తెరపైకి అల్లు అర్జున్ పేరు వచ్చింది. ఇప్పటికే బిగ్ బాస్ రెండో సీజన్ ను హీరో నాని చేస్తాడని, ఆయన పేరును నిర్వాహకులు పరిశీలిస్తున్నారని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. 'బిగ్ బాస్' హోస్ట్ గా ఎన్టీఆర్ ఎగ్జిట్ ఖరారైందని తెలుస్తుండగా, ఇక ఆ స్థానంలో ఎవరు వస్తారన్నది మాత్రం ఇప్పటికి సస్పెన్స్.  

  • Loading...

More Telugu News