ప్రధాని మోదీకి వైసీపీ భయపడుతోందని అర్థమైంది!: పవన్ కల్యాణ్
- ప్రధాని లోక్‌సభలో ప్రసంగిస్తున్నప్పుడు వైసీపీ ఎంపీలు బయటకు వెళ్లిన తీరు అనుమానాలకు బలాన్నిచ్చింది
- నేను ఇచ్చిన మాటపై వెనక్కి వెళ్లే వ్యక్తిని కాదు
- కేంద్రమంత్రి మండలిపై ఎదురుతిరగాలి
- రాష్ట్ర ప్రయోజనాల కోసం రహదారులపైకి వస్తాం
ప్రధానమంత్రి మోదీకి వైసీపీ నేతలు భయపడుతున్నట్లు తనకు అనిపించిందని పవన్ కల్యాణ్ అన్నారు. ప్రధాని లోక్‌సభలో ప్రసంగిస్తున్నప్పుడు వైసీపీ ఎంపీలు బయటకు వెళ్లిన తీరు తన అనుమానాలకు మరింత బలాన్ని చేకూర్చిందని అన్నారు. కేంద్రమంత్రి మండలిపై ఎదురుతిరగాలని, అవసరమైతే రాష్ట్ర ప్రయోజనాల కోసం తాము రహదారులపైకి వస్తామని పవన్ కల్యాణ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కి జరిగిన అన్యాయంపై పార్లమెంటులో చర్చ జరగాలని డిమాండ్ చేశారు.