Venkaiah Naidu: బీఫ్ తినాలనిపిస్తే తినండి కానీ, ‘ఫెస్టివల్స్’ అవసరమా?: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

  • ముద్దుపెట్టుకోవాలని పిస్తే పెట్టుకోండి.. ‘కిస్ ఫెస్టివల్’ అవసరమా?
  • ‘అఫ్జల్ గురు’ అంటూ కొందరు జపం చేస్తున్నారు
  • మన పార్లమెంట్ ను పేల్చేసే ప్రయత్నం చేశాడతడు: వెంకయ్య
బీఫ్ తినాలని ఎవరికైనా అనిపిస్తే తినండి అంతేగానీ, ‘బీఫ్ ఫెస్టివల్’ నిర్వహించాల్సిన అవసరముందా? అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రశ్నించారు. ముంబైలోని ఆర్ఎ పొద్దార్ కాలేజ్ ఆఫ్ కామర్స్ ప్లాటినం జూబ్లీ సెలబ్రేషన్స్ లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అదే విధంగా, ముద్దుపెట్టుకోవాలని పిస్తే పెట్టుకోండి.. దీని కోసం ‘కిస్ ఫెస్టివల్’ లేదా ఇతరుల అనుమతి అవసరమా? అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా పార్లమెంట్ పై దాడి కేసులో దోషి అఫ్జల్ గురు గురించి కూడా ఆయన ప్రస్తావించారు. ‘అఫ్జల్ గురు అంటూ కొందరు జపం చేస్తున్నారు.. అతను ఏం చేశాడో తెలుసా! మన పార్లమెంట్ ను పేల్చేసే ప్రయత్నం చేశాడు’ అన్నారు వెంకయ్య. 
Venkaiah Naidu
vice president

More Telugu News