రెండో పార్ట్ పూర్తి కాకుండానే మూడో పార్ట్ కూడా ప్రకటించేసిన 'బాఘీ' చిత్రయూనిట్!
Add ap7am to your home Screen

రెండో పార్ట్ పూర్తి కాకుండానే మూడో పార్ట్ కూడా ప్రకటించేసిన 'బాఘీ' చిత్రయూనిట్!

  • మంచి వసూళ్లు సాధించిన 'బాఘీ' 
  •  'వర్షం' సినిమాకి రీమేక్ గా 'బాఘీ'
  • 'క్షణం' రీమేక్ గా 'బాఘీ 2'
చిత్రపరిశ్రమలో సాధారణంగా ఒక సినిమా విడుదలై విజయం సాధించిన తరువాత దానికి సీక్వెల్ ప్రకటించడం సంప్రదాయంగా వస్తోంది. అయితే బాలీవుడ్‌ లో ఆ సంప్రదాయాన్ని బ్రేక్ చేస్తూ, పార్ట్ 2 పూర్తికాకుండానే 'బాఘీ' చిత్రయూనిట్ 'బాఘీ 3'ని ప్రకటించేసింది. టైగర్ ష్రాఫ్, సుధీర్ బాబు, శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రల్లో తెలుగు 'వర్షం' రీమేక్ గా సబ్బీర్ ఖాన్ దర్శకత్వంలో 'బాఘీ' చిత్రాన్ని రూపొందించగా, టైగర్ కెరీర్ లో మంచి వసూళ్లు రాబట్టిన సినిమాగా ఇది నిలిచింది.

 దీంతో దానికి సీక్వెల్‌ ను చిత్రయూనిట్ రూపొందిస్తోంది. ఈ సినిమా కూడా తెలుగు సినిమా 'క్షణం'కి రీమేక్ కావడం విశేషం. ఈ సినిమాకి బాలీవుడ్ ప్రముఖ కొరియో గ్రాఫర్ అహ్మద్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో టైగర్ సరసన రియల్ లైఫ్ గర్ల్ ఫ్రెండ్ దిశా పఠానీ నటిస్తోంది. ఇప్పుడు 'బాఘీ 3'ని కూడా తీయనున్నట్టు ఈ చిత్రయూనిట్ ప్రకటించడం విశేషం. ఈ సినిమా హీరో, దర్శకుడు మూడో పార్ట్ కి కూడా పనిచేస్తారు. మిగతా నటీనటులను త్వరలోనే ప్రకటిస్తామని చిత్రయూనిట్ తెలిపింది. కాగా, ఈ మూడు సినిమాలకి నిర్మాతగా సాజిద్ నడియావాలా వ్యవహరిస్తున్నారు.  
MOVIE
BAGHI
SEQUEL
TIGER SHROFF
Bollywood

More Telugu News