Chandrababu: 'కేంద్ర సర్కారుపై అవిశ్వాస తీర్మానం'పై స్పందించిన చంద్రబాబు

  • అవిశ్వాస తీర్మానం వల్ల రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం ఉండదు
  • విభజన చట్టంలో ఇచ్చిన హామీలన్నీ కేంద్ర ప్రభుత్వం పరిష్కరించాలి
  • శాసనసభ, పార్లమెంటు చట్టాలు తెలియకుండా వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు
  • బీజేపీ నుంచి టీడీపీ దూరం అయితే పొత్తు పెట్టుకోవడానికి వైసీపీ ప్రయత్నాలు చేస్తోంది
కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెడదామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అంటోందని, దాని వల్ల రాష్ట్రానికి ఎటువంటి ప్రయోజనం ఉండదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ రోజు పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించిన చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ... శాసనసభ, పార్లమెంటు చట్టాలు తెలియకుండా వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని చంద్రబాబు అన్నారు. బీజేపీ నుంచి తమ పార్టీ దూరం అయితే పొత్తు పెట్టుకోవడానికి వైసీపీ ప్రయత్నాలు చేస్తోందని మండిపడ్డారు.

విభజన చట్టంలో ఇచ్చిన హామీలన్నీ కేంద్ర ప్రభుత్వం పరిష్కరించాలని, హామీలను పరిష్కరించకపోవడంపై కేంద్ర ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు  పోలవరం పూర్తి కాకుండా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఆటంకాలు కలిగిస్తున్నాయని ఆరోపించారు.  
Chandrababu
Telugudesam
YSRCP
Congress
POLAVARAM

More Telugu News