Andhra Pradesh: బీజేపీతో కలిసి ఉంటేనే చంద్రబాబు సీఎం అవుతారు: బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్

  • బీజేపీతో కలిసి వుండాలో లేదో టీడీపీనే నిర్ణయించుకోవాలి
  • పథాధికారుల సమావేశంలో ఎటువంటి గొడవలు జరగలేదు
  • మిత్ర ధర్మానికి తూట్లు పొడుస్తున్న టీడీపీ:  మాధవ్
బీజేపీతో కలిసి ఉంటేనే చంద్రబాబు మళ్లీ సీఎం అవుతారని ఏపీ బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, బీజేపీతో కలిసి వుండాలో లేదో టీడీపీ వాళ్లే నిర్ణయించుకోవాలని అన్నారు. మిత్ర ధర్మానికి టీడీపీ తూట్లు పొడుస్తోందని ఆయన ఆరోపించారు. విజయవాడలో జరిగిన బీజేపీ పథాధికారుల సమావేశంలో ఎలాంటి గొడవలు జరగలేదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. కాగా, ఈ సమావేశంలో బీజేపీ నేత లక్ష్మీపతి రాజా, కంభంపాటి హరిబాబు మధ్య వాగ్వాదం జరిగినట్టు వార్తలు వెలువడ్డ విషయం తెలిసిందే.

 
Andhra Pradesh
bjp

More Telugu News