Amy jackson: డేటింగ్‌తో బిజీబీజీగా గడుపుతున్న ఎమీ జాక్సన్?

  • బ్రిటన్ రియల్ వ్యాపారితో ప్రేమాయణం
  • ప్రియుడితో కలిసి సరదాగా మంచులో స్కేటింగ్
  • వచ్చే ఏడాదిలో ఎమీ రోబో '2.0' విడుదల
'ఐ' చిత్రం తర్వాత శంకర్ దర్శకత్వంలో బ్రిటీష్ భామ ఎమీ జాక్సన్ ఆయన దర్శకత్వంలోనే 'రోబో' సీక్వెల్ '2.0' చేసింది. బహుశా ఆమెలోని ప్రొఫెషనలిజం చూసి శంకర్ వరుసగా మరోసారి ఆమెకు ఛాన్స్ ఇచ్చాడని చెప్పచ్చు. ఈ సినిమా విషయాలను అటుంచితే... ఈ మధ్య ఈ సెక్సీ భామ ప్రేమలో పడిందని, డేటింగ్ చేస్తోందన్న వార్తలు అక్కడా ఇక్కడా వినిపిస్తున్నాయి.

ఆ పుకార్లకు బలం చేకూరేలా ఈ మధ్య ఈ బక్కబలచ భామ తన బాయ్ ఫ్రెండ్‌తో దిగిన ఫొటోలను షేర్ చేసింది. అతని పేరు జార్జ్ పనయోతౌ. బ్రిటీష్ రియల్ వ్యాపారి. మంచు కొండల్లో స్కేటింగ్ చేస్తూ ఇద్దరూ దిగిన ఫొటోని మీరు చూడొచ్చు. ఒకప్పుడు టాలీవుడ్‌ని ఓ ఊపు ఊపిన ఇలియానా డిక్రూయిజ్ ఇప్పటికే ఆస్ట్రేలియా ఫొటోగ్రాఫర్ ఆండ్రూతో చెట్టాపట్టాల్ వేసుకుని తిరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఎమీ వంతొచ్చినట్లుంది.
Amy jackson
George Panayiotou
Robo 2.0
Illeana D'Cruz

More Telugu News