Hyderabad: మీడియా ముందు మహిళపై చెయ్యి చేసుకుని అడ్డంగా బుక్కయిన బేగంపేట ఏసీపీ... వీడియో చూడండి!

  • వెండి ఆభరణాల కేసులో మీడియా ముందుకు నిందితులు
  • తనను ఇరికించారని ఆరోపించిన మహిళ
  • ఆగ్రహంతో మీడియా ముందే కొట్టిన రంగారావు

నగలు కొంటామంటూ ఓ ఆభరణాల షాపునకు వచ్చి కిలో వెండి ఆభరణాలను దొంగతనం చేసిన కేసులో నిందితులను మీడియా ముందు హాజరు పరిచిన వేళ, హైదరాబాద్, బేగంపేట్‌ ఏసీపీ రంగారావు ప్రవర్తించిన తీరు వివాదాస్పదం కాగా, జాతీయ మీడియాలో సైతం ఆ వీడియో వైరల్ అవుతోంది. ముగ్గురు మహిళలతో పాటు దొంగతనం చేసిన సొమ్మును విక్రయిస్తూ పట్టుబడిన మహిళను పోలీసులు అరెస్ట్ చేసిన పోలీసులు, వారిని మీడియాకు చూపించారు.

ఈ సమయంలో నిందితురాలు మాట్లాడుతూ, పోలీసులు బలవంతంగా తనను దొంగతనం కేసులో ఇరికించారని ఆరోపించింది. ఆ వెంటనే ఏసీపీ రంగారావు ఆగ్రహంతో ఆమె చెంప చెళ్లుమనిపించారు. ఈ విషయం అక్కడే ఉన్న మీడియా కెమెరాలకు చిక్కింది. రంగారావు వైఖరిపై విమర్శలు వస్తుండటంతో ఉన్నతాధికారులు దర్యాఫ్తునకు ఆదేశించినట్టు తెలిసింది.

More Telugu News