Actor Sidharth: పాల్ వాల్తాటిలా మిగిలిపోవద్దు!: ప్రియా ప్రకాష్ కు నటుడు సిద్ధార్థ్ సలహా

  • మాలీవుడ్ నయా సెన్సేషన్ ప్రియా ప్రకాష్
  • ఐపీఎల్ లో ఒక్క సీజన్ లో మాత్రమే రాణించిన వాల్తాటి
  • అతనిలా మిగిలిపోవద్దని సిద్ధార్థ్ సలహా
ఒక్క 'కన్నుగీటు'తో అమాంతం స్టార్ డమ్ తెచ్చేసుకుని, ప్రతి ఒక్కరి చూపునూ తన వైపు తిప్పుకున్న మాలీవుడ్ నయా సెన్సేషన్ ప్రియా ప్రకాష్ వారియర్ కు విలువైన సలహా ఇచ్చాడు నటుడు సిద్ధార్థ్. ఆమెను ఐపీఎల్ లో ఒక సీజన్ లో మాత్రమే అదరగొట్టి, ఆపై కనిపించకుండా పోయిన పాల్ వాల్తాటితో పోల్చాడు.

"ప్రియా వారియర్ తన హావభావాలతో ఐపీఎల్ లో పాల్ వాల్తాటి అంత సెన్సేషన్ గా మారింది. వాల్తాటిలా ప్రియ ఒక సీజన్‌ తో మాత్రమే ఆగిపోకుండా తన స్టార్‌ డమ్ కొనసాగించాలి. డెలికేట్ బ్యాలెన్స్‌ ని, స్థిరమైన పెర్ఫార్మెన్స్‌ ను కొనసాగించాలి. గుడ్ లక్ గర్ల్" అని తన సోషల్ మీడియాలో వ్యాఖ్యానించాడు. వాల్తాటి తన ప్రతిభను కొనసాగించలేకపోయాడని చెబుతూ, ప్రియా అలా అవకూడదని కోరుకున్న సిద్ధార్థ కామెంట్ ఇప్పుడు వైరల్ అయింది.
Actor Sidharth
Priya Prakash varriar

More Telugu News