sridevi: ఐదు సిరీస్‌లుగా అందాల నటి శ్రీదేవిపై డాక్యుమెంట‌రీ!

  • తొలి సిరీస్‌లో బాల న‌టిగా శ్రీదేవి సినీరంగ ప్రవేశం 
  • రెండు, మూడు భాగాల‌లో శ్రీదేవి బాలీవుడ్ లోకి ప్రవేశించినప్పటి జీవితం
  • నాలుగ‌వ భాగంలో శ్రీదేవి సాధించిన సినిమా హిట్ల విశేషాలు 
  • చివరి భాగంలో శ్రీదేవితో కలిసి నటించిన న‌టీన‌టుల ఇంట‌ర్వ్యూలు

సినీ నటి, అతిలోక సుందరి శ్రీదేవి జీవితాన్ని ఐదు భాగాలుగా డాక్యుమెంట‌రీగా రూపొందించడానికి బెంగ‌ళూరుకి చెందిన ఆమె ఫ్యాన్స్ క్ల‌బ్ ప్రణాళిక వేసుకుంది. ఈ విషయంపై శ్రీదేవి భ‌ర్త బోనిక‌పూర్‌తో చ‌ర్చ‌లు జ‌రిపినట్లు సమాచారం. బోనిక‌పూర్ కూడా ఈ విషయంపై సానుకూలంగానే స్పందించడంతో ఈ ప్రాజెక్ట్ త్వ‌ర‌లోనే సెట్స్‌పైకి వెళ్లనున్న‌ట్లు తెలిసింది.

ఇక తొలి సిరీస్ లో బాల న‌టిగా శ్రీదేవి సినీరంగ ప్రవేశం ఎలా సాగింద‌న్న విషయాన్ని చూపించనున్నారు. రెండు, మూడు భాగాల‌లో శ్రీదేవి బాలీవుడ్ లోకి ప్రవేశించినప్పటి జీవితం చూపెడతారు. నాలుగ‌వ భాగంలో శ్రీదేవి సాధించిన సినిమా హిట్ల విశేషాలు వుంటాయి. ఇక చివరి భాగంలో శ్రీదేవితో కలిసి నటించిన  న‌టీన‌టుల ఇంట‌ర్వ్యూలు, సినిమా క్లిప్పింగ్స్ ఉంటాయని, అంతేగాక, ఈ భాగంలో కుటుంబ స‌భ్యుల ఇంటర్వ్యూలు కూడా చూపెడతారని సమాచారం.

More Telugu News