Virat Kohli: అనుష్క నాకు ఎంతో అండగా ఉంది: విరాట్ కోహ్లీ

  • మైదానం బయట నుంచి మద్దతిచ్చే వాళ్లూ నా ఫామ్ కు కారణమే
  • ముఖ్యంగా, భార్య అనుష్క శర్మ నాకు  ప్రేరణగా నిలుస్తోంది
  • నిరంతరం ముందుకెళ్లేలా చేస్తోందన్న కోహ్లీ
దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్ ను టీమిండియా కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. విజయానందంలో ఉన్న టీమిండియా కెప్టెన్ కోహ్లీ, మైదానం బయట నుంచి తనకు మద్దతుగా నిలిచిన వారు కూడా తన ఫామ్ కు కారణమనేనని అన్నాడు. ముఖ్యంగా తన భార్య అనుష్క శర్మ ఈ పర్యటనలో తనకు ఎంతో అండగా నిలిచిందని, నిరంతరం తనకు ప్రేరణగా నిలుస్తూ తాను ముందుకెళ్లేలా చేస్తోందని కొనియాడాడు. గతంలో ఆమెపై చాలా మంది విమర్శలు గుప్పించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు.
Virat Kohli
Anushka Sharma

More Telugu News