south mexico: దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం!

  • రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 7.2 గా నమోదు
  • పినోటేపా నసియోనల్ పట్టణం సమీపంలో భూకంపం  
  • భూకంపం ధాటికి  దెబ్బతిన్న పలు భవనాలు

దక్షిణ మెక్సికోలో నిన్న రాత్రి భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 7.2 గా నమోదైంది. మెక్సికోకు 200 మైళ్ల దూరంలో దక్షిణ పసిఫిక్ తీరంలో ఈ భూకంపం సంభవించింది. ఓక్సాకా రాష్ట్రంలోని పినోటేపా నసియోనల్ పట్టణం సమీపంలో ఇది సంభవించినట్టు యూఎస్ జియోలాజికల్ సర్వే పేర్కొంది.

 భూకంపం ధాటికి పలు భవనాలు దెబ్బతినగా, ఇప్పటి వరకు ఎవరూ మృతి చెందినట్టు వార్తలు వెలువడలేదు. సునామీ వచ్చే అవకాశాలు లేవని పసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రం వెల్లడించింది. కాగా, మెక్సికో సిటీలో కూడా భూమి కంపించడంతో భయాందోళనలకు గురైన ప్రజలు తమ ఇళ్లల్లో నుంచి బయటకు పరుగులు తీశారు. అరుపులు, కేకలతో ఆ ప్రాంతం దద్దరిల్లిపోయింది. కాగా, గత సెప్టెంబర్లో సంభవించిన రెండు భూకంపాలతో వందలాది మంది ప్రజలు చనిపోయారు.

More Telugu News