jagan: జగన్ అక్రమాస్తుల కేసులో పెన్నా సిమెంట్ పై ఛార్జిషీట్‌ను విచారణకు స్వీకరించిన ఈడీ కోర్టు.. సమన్లు జారీ

  • నిన్న ఇందూటెక్ జోన్ ఛార్జిషీటును విచారణకు స్వీకరించిన ఈడీ కోర్టు
  • ఈ రోజు 'పెన్నా' వ్యవహారంపై విజయసాయిరెడ్డి, పెన్నా గ్రూప్ అధినేత ప్రతాపరెడ్డికి కూడా సమన్లు
  • వచ్చేనెల 16న కోర్టుకు హాజరుకావాలని ఆదేశాలు

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి మరో షాక్ తగిలింది. నిన్న ఇందూటెక్ జోన్ ఛార్జిషీటును ఈడీ కోర్టు విచారణకు స్వీకరించి, వచ్చేనెల 16న హాజరుకావాలని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ రోజు ఈడీ కోర్టు... జగన్ అక్రమాస్తుల కేసులో పెన్నా సిమెంట్ పై ఛార్జిషీట్‌ను విచారణకు స్వీకరించింది. ఈ వ్యవహారంలోనూ వచ్చేనెల 16న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. జగన్‌తో పాటు ఈ కేసులో విజయసాయిరెడ్డి, పెన్నా గ్రూప్ అధినేత ప్రతాపరెడ్డికి ఈడీ కోర్టు సమన్లు జారీ చేసింది.  

  • Loading...

More Telugu News