tamil: ప్రేమికుల రోజునే తమిళ నటుడు బాలాజీకి విడాకులు!

  • ఏడాదిన్నర వైవాహిక జీవితం ముగిసింది
  • తమిళ టీవీ నటుడు బాలాజీ - ప్రీతి జంటకు విడాకులు
  • ఈ విషయాన్ని ధ్రువీకరించిన బాలాజీ

ప్రపంచ వ్యాప్తంగా మొన్న ప్రేమికుల రోజు. ఆ రోజునే తమిళ టీవీ నటుడు యూతన్ బాలాజీ-ప్రీతి జంటకు కోర్టు విడాకులు మంజూరు చేసింది. ‘కాన కానమ్ కాళంగల్’ సీరియల్ ద్వారా నటుడిగా పేరు సంపాదించుకున్న బాలాజీ వివాహం ప్రీతితో 2016లో జరిగింది. ఏడాదిన్నర వైవాహిక జీవితం గడిపిన ఈ జంట మధ్య భేదాభిప్రాయాలు తలెత్తడంతో మద్రాసు హైకోర్టులో విడాకులకు దరఖాస్తు చేశారు. ఈ కేసును విచారించిన న్యాయస్థానం వారికి విడాకులు మంజూరు చేస్తున్నట్టు నిన్న ప్రకటించింది.

కాగా, ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా నటుడు బాలాజీ ధ్రువీకరించాడు. ప్రేమికుల దినోత్సవం రోజున ఏం ప్లాన్ చేశావు? అంటూ తనను చాలా మంది ప్రశ్నిస్తున్నారని, దేవుడు తనకు భిన్నమైన ప్లాన్ ను ఇచ్చాడని, ఈరోజు నిద్ర లేచి, హైకోర్టుకు వెళ్లానని, అక్కడ తమకు విడాకులు మంజూరు అయ్యాయని తన ట్వీట్ లో పేర్కొన్నాడు. పరస్పర అంగీకారంతో తమకు విడాకులు మంజూరయ్యాయని చెప్పిన బాలాజీ, అయినా, సంతోషంగానే ఉన్నానని, హ్యాపీ వేలంటైన్స్ డే అని చెప్పడం గమనార్హం.

  • Loading...

More Telugu News