Telugudesam: చెవిలో పువ్వుతో టీడీపీ ఎంపీ శివప్రసాద్ నిరసన

  • ఏపీకి ఇచ్చిన హామీలను మోదీ పట్టించుకోవడం లేదు
  • హామీలు అమలు చేయకపోతే పుట్టగతులుండవు
  • తిరుపతిలోని తారకరామ స్టేడియం వద్ద శివప్రసాద్ నిరసన
ఏపీకి ఇచ్చిన హామీలను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చకపోవడంపై టీడీపీ నేతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ ఎంపీ శివప్రసాద్ ఈ రోజు చెవిలో పువ్వు పెట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రచారం నిమిత్తం తిరుపతిలోని తారకరామ స్టేడియానికి వచ్చిన నరేంద్రమోదీ ఏపీకి పలు హామీలు గుప్పించిన విషయాన్ని శివప్రసాద్ ప్రస్తావించారు. ఇదే స్టేడియం వద్ద శివప్రసాద్ తన చెవిలో పువ్వు పెట్టుకుని నిరసన తెలిపారు. ఏపీకి ఇచ్చిన హామీలను మోదీ పట్టించుకోవడం లేదని, హామీలు అమలు చేయకపోతే పుట్టగతులుండవంటూ ఆయన మండిపడ్డారు.
Telugudesam
sivaprasad

More Telugu News