Tamilnadu: తమిళనాడు మళ్లీ ఉద్రిక్తం... కన్నడిగుల హోటల్స్, స్కూల్స్ ముందు భారీ భద్రత!

  • కావేరీ జలాల విషయమై దశాబ్దాలుగా వివాదాలు
  • నేడు కీలక తీర్పివ్వనున్న సుప్రీంకోర్టు
  • దాడులు జరగవచ్చని నిఘా వర్గాల హెచ్చరికలు
  • ఉడిపి హోటల్స్, కర్ణాటక బ్యాంకు శాఖల ముందు భద్రత

కావేరీ నదీ జలాల విషయంలో ఎగువన ఉన్న కర్ణాటక, దిగువన ఉన్న తమిళనాడు రాష్ట్రాలు కొన్ని దశాబ్దాల నుంచి గొడవలు పడుతుండగా, ఈ కేసులో విచారణను ముగించిన సుప్రీంకోర్టు నేడు కీలక తీర్పు ఇవ్వనున్న నేపథ్యంలో తమిళనాడులో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

తీర్పు తరువాత తమిళనాడులో ముఖ్యంగా చెన్నైలోని కన్నడిగుల ఆస్తులపై దాడులు జరగవచ్చని నిఘా వర్గాల నుంచి సమాచారం అందడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. చెన్నైలోని కర్ణాటక విద్యాసంస్థలు, కర్ణాటక బ్యాంకు శాఖలు, ఉడిపి హోటల్స్, భారీగా పోలీసు భద్రతను ఏర్పాటు చేశారు. కాగా, ఎగువన ఉన్న కర్ణాటకకు కొంత వ్యతిరేకంగా తీర్పు ఉండవచ్చని, ఆపై దాన్ని ఆ రాష్ట్రం పాటించదని తమిళనాడు ప్రజలు భావిస్తుండగా, తమకు తాగేందుకే నీరు లేకుంటే, దిగువకు వాటా ఎందుకు ఇవ్వాలని కర్ణాటక వాసులు ప్రశ్నిస్తున్న పరిస్థితి.

  • Loading...

More Telugu News