Pawan Kalyan: మీడియాతో ఏమీ మాట్లాడకుండా వెళ్లిపోయిన పవన్ కల్యాణ్!

  • ట్యాంక్ బండ్ వద్దకు వచ్చిన పవన్
  • అంబేద్కర్ కు పూలమాల వేసి నివాళి 
  • భారీ ఎత్తున చేరుకున్న అభిమానులతో ట్రాఫిక్ జామ్
కొద్దిసేపటి క్రితం హైదరాబాద్, ట్యాంక్ బండ్ సమీపంలోని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. వందలాది మంది అభిమానులు వెంటరాగా, ట్యాంక్ బండ్ వద్దకు వచ్చిన పవన్, మీడియాతో ఏమీ మాట్లాడకుండానే వెళ్లిపోయారు.

ఆ ప్రాంతంలో భారీ ఎత్తున పవన్ అభిమానులు గుమికూడటం, ఉదయం పూట కూడా ట్రాఫిక్ స్తంభించడం, క్షణక్షణానికీ అక్కడికి చేరుకుంటున్న అభిమానుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో, పవన్ కేవలం అభివాదానికే పరిమితం అయ్యారు. ఏదైనా మాట్లాడాలని మీడియా ప్రతినిధులు కోరినా, పవన్ ఆసక్తిని చూపలేదు.
Pawan Kalyan
Tank Bund

More Telugu News