Tollywood: షూటింగ్ లో గాయపడ్డ సినీ నటుడు చలపతిరావు.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న డాక్టర్లు!

  • రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుగుతుండగా ప్రమాదం
  • అపోలో ఆసుపత్రికి తరలించిన చిత్ర యూనిట్
  • ‘అల్లరి’ నరేష్ సినిమా షూటింగ్ లో సంఘటన 
ఓ సినిమా షూటింగ్ లో ప్రముఖ సినీ నటుడు చలపతిరావుకు స్వల్ప గాయాలయ్యాయి. రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుగుతుండగా ఈ ప్రమాదం జరిగింది. షూటింగ్ లో భాగంగా బస్సు వెనుక నిచ్చెన ఎక్కుతుండగా ఆయన కిందపడిపోయారు. వెంటనే అప్రమత్తమైన చిత్రయూనిట్ చలపతిరావును అపోలో ఆసుపత్రికి తరలించారు. కాగా, చలపతిరావు ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు చెప్పినట్టు సమాచారం. ‘అల్లరి’ నరేష్ సినిమా షూటింగ్ లో చలపతిరావు ప్రమాదానికి గురైనట్టు తెలుస్తోంది.
Tollywood
chalapathi rao

More Telugu News