ed: అక్రమాస్తుల కేసులో వైఎస్‌ జగన్‌కు ఈడీ కోర్టు సమన్లు

  • ఇందూటెక్ జోన్ ఛార్జిషీటును విచారణకు స్వీకరించిన ఈడీ కోర్టు
  • ఇందూ టెక్ జోన్ వ్యవహారంలో వచ్చేనెల 16న హాజరుకావాలి
  • విజయసాయిరెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, బీపీ ఆచార్యతో పాటు పలువురికి కూడా సమన్లు

అక్రమాస్తుల కేసును ఎదుర్కుంటోన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి మరో షాక్ తగిలింది. ఆదాయానికి మించిన ఆస్తుల వ్యవహారంలో ఇందూటెక్ జోన్ ఛార్జిషీటును ఈడీ కోర్టు విచారణకు స్వీకరించింది. ఈ వ్యవహారంలో వచ్చేనెల 16న జగన్ ను ఈడీ కోర్టుకు హాజరుకావాలని ఆదేశిస్తూ సమన్లు జారీ చేసింది.

జగన్‌తో పాటు నిందితులుగా ఉన్న విజయసాయిరెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, బీపీ ఆచార్య, నిమ్మగడ్డ ప్రసాద్, ఇందూ శ్యామ్‌ప్రసాద్ రెడ్డికి కూడా ఈడీ కోర్టు సమన్లు జారీ చేసింది. కాగా, జగన్ ప్రస్తుతం నెల్లూరులో పాదయాత్ర చేస్తోన్న విషయం తెలిసిందే. అక్రమాస్తుల కేసులో ఆయన ప్రతి శుక్రవారం హైదరాబాద్ వచ్చి సీబీఐ కోర్టులో విచారణ ఎదుర్కుంటున్నారు.

  • Loading...

More Telugu News