nepal: నేపాల్‌ 41వ ప్రధానిగా కమ్యూనిస్టు నేత కేపీ ఓలి!

  • రాజీనామా చేసిన దూబా
  • నూతన ప్రధానిగా ఓలి నియామకం 
  • దేశ ప్రధానిగా రెండోసారి 
నేపాల్ నూతన ప్రధానిగా షేర్ బహదూర్ దూబా స్థానంలో నేపాల్ కమ్యూనిస్టు నేత ఖడ్గా ప్రసాద్ ఓలి బాధ్యతలు స్వీకరించనున్నారు. 65 సంవత్సరాల ఓలిని దేశానికి 41వ ప్రధానిగా నియమిస్తూ నేపాల్ అధ్యక్షుడు భండారీ ఆదేశాలు జారీ చేశారు. రాజ్యాంగ పరమైన మార్పులతో పాటు నూతన పార్లమెంటరీ ఎన్నికల ఫలితాలను అనుసరించి దూబా రాజీనామా చేశారు. కాగా, కేపీ ఓలి గతంలో అక్టోబర్ 2015 నుంచి ఆగష్టు 2016 వరకు ప్రధానిగా వ్యవహరించారు.
nepal
pm
Prime Minister

More Telugu News