amazon: అత్యంత విలువైన కంపెనీల జాబితాలో మైక్రోసాఫ్ట్ ని దాటేసిన అమెజాన్ !

  • మొదటి, రెండవ స్థానాల్లో ఆపిల్, ఆల్ఫాబెట్ 
  • 702.5 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువతో 3వ స్థానం
  • వెల్లడించిన న్యూయార్క్ పోస్ట్

న్యూయార్క్ పోస్ట్ కథనం ప్రకారం అమెజాన్ 702.5 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువతో మొట్ట మొదటిసారి మైక్రోసాఫ్ట్ ని వెనక్కి నెట్టేసి ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీల జాబితాలో 3వ స్థానంలో నిలిచింది. కాగా మైక్రోసాఫ్ట్ 699.2 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువతో 4వ స్థానానికి పడిపోయింది. ఇక ఈ జాబితాలో 849.2 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువతో ఆపిల్ మొదటి స్థానంలో ఉండగా, 745.1 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువతో గూగుల్ అనుబంధ సంస్థ ఆల్ఫాబెట్ రెండవ స్థానంలో ఉంది. అలాగే 521.5 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువతో ఫేస్ బుక్ 5వ స్థానంలో ఉంది.

More Telugu News