Donald Trump: ట్రంప్ కోసం పోర్న్ స్టార్ కు రూ. 87 లక్షలు ఇచ్చిన మాట నిజమే: ఒప్పుకున్న ట్రంప్ పర్సనల్ లాయర్ మైఖేల్!

  • శృంగార తార స్టీఫెన్‌ క్లిఫర్డ్‌ అలియాస్ స్టార్మీ డేనియల్స్‌
  • 2006లో ట్రంప్ తో శారీరక సంబంధం
  • బయట పెట్టకుండా ఉండేందుకు ఎన్నికల ముందు నజరానా!
అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తరఫున పోర్న్ స్టార్ స్టీఫెన్‌ క్లిఫర్డ్‌ అలియాస్ స్టార్మీ డేనియల్స్‌ కు 1.30 లక్షల డాలర్లు (సుమారు రూ. 87 లక్షలు) ఇచ్చిన మాట వాస్తవమేనని ట్రంప్ పర్సనల్ లాయర్ మైఖేల్ కోహాన్ వెల్లడించినట్టు 'న్యూయార్క్ టైమ్స్' పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. ఇది చట్టబద్ధమైన చెల్లింపేనని చెప్పిన మైఖేల్, ఎందుకోసం అంత డబ్బు ఇచ్చారన్న విషయాన్ని మాత్రం చెప్పలేదు.

తాను ఆమెకు డబ్బులు ఇచ్చిన విషయం ట్రంప్ కు తెలుసునని, తనకు మాత్రం ఆయన తిరిగి డబ్బు ఇవ్వలేదని మైఖేల్ సంచలన ఆరోపణలు కూడా చేశారు. కాగా, ట్రంప్ తనతో శారీరక సంబంధాన్ని పెట్టుకున్నాడని స్టీఫెన్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఓ సాధారణ పౌరుడిగా ఉన్న వేళ ట్రంప్, స్టీఫెన్ మధ్య బంధం నడిచిందని, 2016లో ఎన్నికలకు ముందు ఆ సంబంధాన్ని బయట పెట్టకుండా ఉండేందుకే ఆమెకు ఇంత భారీ మొత్తంలో డబ్బు ఇచ్చారని ఆరోపణలు వచ్చాయి. తొలిసారి వాల్ స్ట్రీట్ జర్నల్ లో ఈ కథనాలు రాగా, అప్పట్లో సంచలనాన్నే కలిగించాయి.
Donald Trump
USA
Extra Marital Affair
Smarty Denials

More Telugu News