pavankalyan: పవన్ ఏ బ్యానర్లో చేస్తాడనేదే సస్పెన్స్ గా మారింది!

  • ఒకే ఒక సినిమా చేసే ఆలోచనలో పవన్ 
  • మైత్రీ మూవీ మేకర్స్ లో నంటూ టాక్ 
  • ఎ.ఎం. రత్నంతో నంటూ ప్రచారం 
  • త్వరలో సెట్స్ పైకి
పవన్ ఇక పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వచ్చేసినట్టేననీ, అందుకే ఇక సినిమాలు చేయరనే టాక్ చాలా రోజుల నుంచి వినిపిస్తోంది. అయితే గతంలో కొన్ని బ్యానర్స్ నుంచి తీసుకున్న అడ్వాన్స్ లు ఆయన దగ్గర ఉండిపోయాయి. వాటిని తిరిగి ఇచ్చేయడానికైనా ఆయన ఒక సినిమా చేయవలసి ఉంటుంది. దీంతో ఎన్నికలకి ఇంకాస్త సమయం వుంది కనుక, ఒక సినిమా చేయవచ్చనే ఆలోచనలో పవన్ వున్నాడని అంటున్నారు.

ఆయనకి అడ్వాన్స్ ఇచ్చిన బ్యానర్స్ లో మైత్రీ మూవీ మేకర్స్ పేరు కూడా వుంది. అందువలన వాళ్లకి ఒక సినిమా చేయవచ్చనే ప్రచారం జరుగుతోంది. కానీ పవన్ మాత్రం ఎ.ఎం.రత్నం ప్రాజెక్టుపై ఆసక్తిని చూపుతున్నట్టు సమాచారం. గతంలోనే ఈ ప్రాజెక్టు పూజా కార్యక్రమాలు జరుపుకుంది. మైత్రీ మూవీ మేకర్స్ కి సినిమా చేస్తే, ఆ సినిమాకి సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తాడు.

ఇక ఎ.ఎం.రత్నం బ్యానర్లో పవన్ చేస్తే దర్శకుడు ఎవరనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో పవన్ ఈ రెండు బ్యానర్స్ లో ఎవరితో ముందుకు వెళతాడనేది సస్పెన్స్ గా మారింది. ఇక ఎవరితో సినిమా చేసినా అది మార్చి చివరివారంలో గానీ ఏప్రిల్ మొదటివారంలోగాని మొదలవుతుందని అంటున్నారు.
pavankalyan

More Telugu News