Train: గురక పెడుతూ ఇబ్బంది పెడుతున్న ప్రయాణికుడికి జాగారం శిక్ష..!

  • ఎల్టీటీ - దర్భంగా రైల్లో ఘటన
  • నిద్రపోకూడదని కోరిన ప్రయాణికులు
  • ఎట్టకేలకు అంగీకరించిన గురక పెట్టే రామచంద్ర

గురక... నిద్రపోతున్న వేళ తెలియకుండా వచ్చి, చుట్టుపక్కల వారికి నరకం చూపించే ఓ రకమైన రోగం. ఈ అలవాటున్న వాళ్లు నిద్రపోతుంటే, చుట్టుపక్కల వారు మేలుకొనాల్సిందే. ఇక రైల్లో ఓ ప్రయాణికుడు పెడుతున్న గురక దెబ్బకు, చుట్టుపక్కల వారికి ఎవరికీ కంటి మీద కునుకు లేకుండా పోగా, అందరూ కలసి అతన్ని నిద్రలేపి, రాత్రంతా మేలుకోబెట్టారు. ఈ ఘటన లోకమాన్య తిలక్ - దర్భంగాల మధ్య నడిచే పవన్ ఎక్స్ ప్రెస్ రైలు త్రీటైర్ ఏసీ బోగీలో జరిగింది.

 రామచంద్ర అనే ప్రయాణికుడు గురక పెడుతుంటే, మిగతా వారంతా కలసి అతన్ని నిద్రలేపారు. అతని కారణంగా తాము పడుతున్న అవస్థను వివరించారు. నిద్రపోకుండా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా తీవ్ర వాగ్వివాదాలే జరిగాయి. చివరకు రామచంద్రను కొన్ని గంటలపాటు ఆపితే, మిగతా వారంతా హాయిగా నిద్రపోవచ్చని తేల్చారు. కాసేపు కోపంతో ఊగిపోయినా, చివరకు రామచంద్ర తోటి ప్రయాణికుల మాట వినక తప్పలేదు. ఆయన రాత్రంతా మేలుకుని ఉండటం ఇతర ప్రయాణికులకూ నచ్చింది. తెల్లారేసరికి అంతా కలిసి కబుర్లు చెప్పుకుంటూ కనిపించారని రైల్లో టీటీఈ గణేశ్ వి విర్హా వెల్లడించారు.

  • Loading...

More Telugu News