Telugudesam: చంద్రబాబు రాజకీయాలు చేసేటప్పుడు జగన్ పిల్లోడు.. హీరోయిన్స్ తో విలాసాల్లో ఉండేవాడు: టీడీపీ ఎమ్మెల్యే బండారు ఆరోపణలు

  • పవన్ కల్యాణ్ కమిటీతో జగన్ కు భయం పట్టుకుంది
  • ప్రజలు తమను మర్చిపోతారనే భయంతోనే రాజీనామా డ్రామాలు
  • మార్చి 5 లోపు ఏపీకి బీజేపీ న్యాయం చేస్తుంది: బండారు
చంద్రబాబు జాతీయ రాజకీయాలు చేసే సమయంలో జగన్ పిల్లోడని, బెంగళూరులోనో లేక మరెక్కడో హీరోయిన్స్ తో విలాసాల్లో ఉండేవాడని పెందుర్తి టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి తీవ్ర ఆరోపణలు చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కమిటీతో వైసీపీ అధినేత జగన్ కు భయం పట్టుకుందని బండారు సత్యనారాయణమూర్తి విమర్శించారు. 

ప్రజలు తమను మర్చిపోతారనే భయంతోనే తమ ఎంపీలతో రాజీనామా డ్రామాకు తెరదీశారని, మార్చి 5 లోపు ఏపీకి బీజేపీ న్యాయం చేస్తుందని ఆశిస్తున్నామని అన్నారు. వాస్తవానికి జగన్ మంత్రి కూడా కాలేడని ఎద్దేవా చేశారు. టీడీపీ మద్దతు ఉన్నన్ని సార్లు బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉందని, 2019లో అప్పటి పరిస్థితులను బట్టి పొత్తుపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. పార్లమెంట్ సెషన్స్ లోనే వైసీపీ ఎంపీలు రాజీనామా చేయాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు.
Telugudesam
bandaru satyanarayana

More Telugu News