chintamaneni prabhakar: ఎమ్మెల్యే చింతమనేనికి బెయిల్ మంజూరు

  • వట్టిపై దాడి కేసులో చింతమనేనికి జైలు శిక్ష
  • బెయిల్ పిటిషన్ ను విచారించిన కోర్టు
  • బెయిల్ మంజూరు 

మాజీ మంత్రి వట్టి వసంతకుమార్ పై దాడి చేసిన కేసులో టీడీపీ ఎమ్మెల్యే, ఏపీ ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ కు భీమడోలు న్యాయస్థానం రెండేళ్ల జైలు శిక్షను విధించిన సంగతి తెలిసిందే. దీంతోపాటు రూ. 500 జరిమానా కూడా విధించింది. వెంటనే ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ను కోర్టు విచారించింది. అనంతరం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.

ఘటన వివరాల్లోకి వెళ్తే, 2011లో దెందులూరులో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో అప్పటి మంత్రి వట్టికి, ఎమ్మెల్యే చింతమనేనికి మధ్య వివాదం తలెత్తింది. ఈ సందర్భంగా చింతమనేని తనపై దాడి చేశారంటూ దెందులూరు పోలీస్ స్టేషన్ లో వట్టి ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఏడేళ్ల పాటు ఈ కేసును విచారించిన భీమడోలు న్యాయస్థానం... వట్టిపై దాడి జరిగిందని నిర్ధారించి, చింతమనేనికి జైలు శిక్షను విధించింది.

More Telugu News