సినీ దర్శక దిగ్గజం బాలచందర్ ఆస్తుల వేలం ప్రకటన.. కలకలం!
- ఓ సీరియల్ కోసం ఇల్లు, కార్యాలయం తాకట్టు
- ఒకేసారి చెల్లించేలా చర్యలు చేపట్టామని, ఇంతలోనే వేలం నోటీసు వచ్చిందన్న ఆయన కుమార్తె
- కలత చెందుతున్న అభిమానులు
బాలచందర్ కు చెందిన కవితాలయా సంస్థ నిర్మించిన ఓ టీవీ సీరియల్ కోసం ఆయన ఇల్లు, కార్యాలయాన్ని 2010లో యూకో బ్యాంకులో తాకట్టు పెట్టారని పుష్పా తెలిపారు. 2015లో సీరియల్ నిర్మాణ పనులను రద్దు చేశామని, డిజిటల్ నిర్మాణ పనులు చేపట్టామని ఆమె చెప్పారు. అప్పటి వరకు బ్యాంకు రుణంపై అసలుతో పాటు కొంతమేర వడ్డీని చెల్లించామని తెలిపారు. మిగిలిన మొత్తాన్ని ఒకేసారి చెల్లించేలా ప్రయత్నం చేస్తున్నామని... అయితే, ఇదే సమయంలో బ్యాంకు వేలం ప్రకటనను విడుదల చేసిందని చెప్పారు. ఈ విషయం పట్ల కలత చెందాల్సిన అవసరం లేదని... తాము అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు.