reliance jio phone: మొబిక్విక్ నుంచి జియో ఫీచర్ ఫోన్ బుక్ చేసుకునే అవకాశం!

  • జియో ఫోన్ ప్రైవేటు ప్లాట్ ఫామ్ పై విక్రయం మొదటిసారి
  • ఈ మేరకు రెండు కంపెనీల ఒప్పందం
  • పేమెంట్ చేసి సమీపంలోని స్టోర్ లో ఫోన్ పొందే అవకాశం

రిలయన్స్ జియో, మొబైల్ రీచార్జ్, పేమెంట్స్ సంస్థ మొబిక్విక్ చేతులు కలిపాయి. జియో ఫీచర్ ఫోన్లను ఇకపై మొబిక్విక్ ప్లాట్ ఫామ్ నుంచి బుక్ చేసుకోవచ్చు. ఇప్పటి వరకు జియో ఫోన్లు ఆన్ లైన్ లో జియో వెబ్ సైట్ లోనే బుక్ చేసుకునే అవకాశం ఉండగా, మొదటిసారి ఈ అవకాశం థర్డ్ పార్టీ ప్లాట్ ఫామ్ పై అందుబాటులోకి వచ్చింది.

జియో ఫోన్ కొనుగోలు చేయాలనుకునే యూజర్లు మొబిక్విక్ హోమ్ పేజీలో రీచార్జ్ ఐకాన్ ను క్లిక్ చేయాలి. ఇక్కడ సెలక్ట్ ఫోన్ బుకింగ్ ఆప్షన్ ఎంచుకోవాలి. జియో ఫోన్ సెలక్ట్ చేసుకుని పేమెంట్ చేయాలి. దాంతో హ్యాండ్ సెట్ ను ఏ స్టోర్ నుంచి పికప్ చేసుకోవాలన్న సమాచారం కస్టమర్ కు ఎస్ఎంఎస్ రూపంలో వస్తుంది. 2.4 అంగుళాల 4జీ ఫీచర్ ఫోన్ ను రిలయన్స్ జియో గతేడాది కస్టమర్ల కోసం తీసుకొచ్చిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News