Ppf: చిన్న మొత్తాల పొదుపు పథకాలకు కొత్త రూపం... ఎప్పుడు అవసరమైనా వెనక్కి తీసుకునే సౌలభ్యం!

  • బడ్జెట్లో మార్పుల్ని ప్రతిపాదించిన కేంద్ర ప్రభుత్వం
  • దీంతో ఈ పథకాలకు ఆదరణ పెరిగే అవకాశం
  • పాత చట్టాల రద్దు

పోస్టాఫీసు పథకాలుగా అందరికీ దగ్గరైన చిన్న మొత్తాల పొదుపు పథకాలకు కేంద్ర ప్రభుత్వం మార్పుల్ని ప్రతిపాదించింది. పీపీఎఫ్ సహా అన్ని రకాల స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ నుంచి అవసరమైనప్పుడు తప్పుకునే అవకాశం ఇవ్వనుంది. ఈ ప్రతిపాదన వల్ల ఈ పథకాలకు ఆదరణ పెరిగే అవకాశాలున్నాయి. ఫిబ్రవరి 1 బడ్జెట్ లో ఈ మేరకు కేంద్రం మార్పుల్ని ప్రవేశపెట్టింది. గవర్నమెంట్ సేవింగ్స్ ప్రమోషన్ యాక్ట్ ను ప్రతిపాదించింది.

ప్రస్తుతమున్న పీపీఎఫ్ యాక్ట్ 1968, గవర్నమెంట్ సేవింగ్స్ సర్టిఫికెట్ యాక్ట్ 1959, గవర్నమెంట్ సేవింగ్స్ బ్యాంకు యాక్ట్ 1873లను రద్దు చేయనుంది. అలాగే, చిన్న మొత్తాల పొదుపు పథకాల నుంచి వైదొలిగే నిబంధనలను ఎప్పటికప్పుడు సవరించే అధికారం కేంద్రానికి ఉంటుంది. వైద్యం, ఇతర అత్యవసరాల్లో డబ్బుల్ని ఈ పథకాల నుంచి వెనక్కి తీసుకునే అవకాశం రానుంది. అలాగే, మైనర్లను వారసులుగా నామినేట్ చేసుకోవచ్చు. అన్ని పథకాల్లోనూ మైనర్ల తరఫున సంరక్షకులు డిపాజిట్ చేసుకోవచ్చు. చిన్న మొత్తాల పొదుపు పథకాలు అన్నింటిలోనూ ఒకే విధమైన నిబంధనలు ఉండేందుకు కేంద్ర సర్కారు ఈ మేరకు మార్పులకు పూనుకుంది. 

More Telugu News