whatsapp: వాట్సాప్ లో పేమెంట్స్ సేవలు ఇలా...!

  • ఆండ్రాయిడ్ వెర్షన్ 2.18.46 పై లభ్యం
  • ఐవోఎస్ యూజర్లకు అందుబాటులోకి
  • ఇరువైపులా వాట్సాప్ యూపీఐ ఫీచర్ ను ఎనేబుల్ చేసుకోవాలి

ఫేస్ బుక్ కు చెందిన వాట్సాప్ సంస్థ ఎట్టకేలకు పేమెంట్స్ సదుపాయాన్ని యూజర్ల కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది. వాట్సాప్ తాజా వెర్షన్ 2.18.46 పైనే ఇది అందుబాటులో ఉంటుంది. ఆండ్రాయిడ్, ఐవోఎస్ యూజర్లకు సైతం అందుబాటులోకి వచ్చింది.

పేమెంట్స్ చేసేందుకు ఆండ్రాయిడ్ యూజర్లు వాట్సాప్ లో ఫ్రెండ్స్ ప్రొఫైల్ కు వెళ్లాలి. అటాచ్ మెంట్ (పేపర్ క్లిప్ ఆకారంలో ఉన్నది) ను సెలక్ట్ చేయాలి. ఇక్కడ పేమెంట్ ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని సెలక్ట్ చేసుకోవాలి. అప్పుడు మీ ఫ్రెండ్ వాట్సాప్ యూపీఐ ఫీచర్ ను కలిగి లేరన్న సందేశం కనిపించొచ్చు. అలాంటప్పుడు మీ ఫ్రెండ్స్ వాట్సాప్ యూపీఐ ఫీచర్ ను ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత యాప్ లోని సెట్టింగ్స్ లోకి వెళితే అక్కడ పేమెంట్స్ ఆప్షన్ కనిపిస్తుంది. మీ ఫ్రెండ్స్ ను కూడా యూపీఐ సేవల్లోకి ఆహ్వానించొచ్చు.

More Telugu News